తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి గుణశేఖర్ తాజాగా శాకుంతలం అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. రుద్రమదేవి అనే విజయవంత మైన మూవీ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ తాజాగా శాకుంతలం అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నిన్న అనగా ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది.

మూవీ ని 2D మరియు 3D వర్షన్ లలో విడుదల చేశారు. ఈ సినిమాలో దేవ్ మోహన్ హీరో గా నటించగా ... సమంత హీరోయిన్ గా నటించింది. మోహన్ బాబు ఈ మూవీ లో ఒక కీలకపాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే రుద్రమదేవి మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని గుణశేఖర్ తెరకెక్కించిన మూవీ కావడం ... సమంతమూవీ లో హీరోయిన్ పాత్రలో నటిస్తూ ఉండడం ... ఈ సినిమాను 3D వర్షన్ లో తెరకెక్కించడం ... పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

 అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదని తెలుస్తోంది. మరి ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లు రిపోర్ట్ అయ్యాయో మరి కొద్ది సేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: