తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నరేష్ "అల్లరి" మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ కి నటుడు చలపతి రావు కుమారుడు అయినటువంటి రవి బాబు దర్శకత్వం వహించాడు. రవిబాబు ఈ మూవీ తోనే దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని రవి బాబు తో కలిసి సురేష్ బాబు నిర్మించాడు. ఈ మూవీ 2002 వ సంవత్సరం మే 10 వ తేదీన పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయింది.

ఆ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి మౌత్ టాక్ ను తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదల అయ్యి 21 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. అందులో భాగంగా ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఈ సినిమాను కేవలం 70 లక్షల బడ్జెట్ తో రూపొందించారు. ఈ మూవీ ద్వారా నిర్మాతలకు సాటిలైట్ ... థియేటర్ హక్కులు ఇలా అన్ని హక్కుల ద్వారా 2 కోట్ల వరకు లాభం వచ్చిందట.

అలాగే ఈ మూవీ యొక్క షూటింగ్ మొత్తాన్ని కేవలం 24 రోజుల్లోనే కంప్లీట్ చేశారట.  ఇలా చాలా తక్కువ బడ్జెట్ తో రూపొంది చాలా తక్కువ రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించి మంచి కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ ద్వారా నరేష్ కు నటుడుగా గుర్తింపు లభించగా ... రవి బాబు కు దర్శకుడిగా సూపర్ క్రేజ్ లభించింది. ఈ మూవీ ఈ ఇద్దరికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: