కమెడియన్ అలీ పవన్ ల మధ్య సాన్నిహిత్యం మాటలకు అందనిది. పవన్ తో అత్యంత సాన్నిహిత్యం కొనసాగించే వ్యక్తులలో అలీ మొదటి వరసలో ఉంటాడు. ఈ కారణాలు వల్ల పవన్ నటించే ప్రతి సినిమాలోను అలీ నటించి తీరుతాడు. 

ఇలాంటి సాన్నిహిత్యం ఉన్న వీరిద్దరి కాంబినేషన్ ‘కాటమరాయుడు’ సినిమాలో మళ్ళీ కనబడబోతోంది. అయితే ఈమధ్య జరిగిన ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అలీ చేసిన హంగామా అంతాఇంతా కాదు. వేదిక పై ఒక సందర్భంలో అలీ వేసిన జోక్ కు పవన్ అతిగా నవ్వడం ఆ ఆడియో ఫంక్షన్ లైవ్ ను ప్రత్యక్షంగా చూస్తున్న వారికి కనిపించింది. అయితే పవన్ కు అంతగా నవ్వు తెప్పించే జోక్ అలీ ఏమి వేసాడో చాలామందికి అర్ధం కాలేదు. 

అయితే ఆ జోక్ విషయాన్ని ఇప్పుడు అలీ ఒక కార్యక్రమంలో బయట పెట్టాడు. పవన్ కళ్యాణ్ వేసుకున్న డ్రెస్ ను ‘కాటమరాయుడు’ నిర్మాత శరత్ మరార్ తన స్పీచ్ లో తెగ పొగుడుతూ పవన్ ను ఆకాశంలోకి ఎత్తేశాడు. ఈ పొగడ్తలు విన్న అలీ ఆరోజు ఆ ఫంక్షన్ లో పవన్ తో  ‘శరత్ మరార్  మళ్లీ పెళ్లి గానీ చేస్తాడా ఏంటి’ అంటూ అలీ పవన్ తో జోక్ కట్ చేసాడట. ఆ జోక్ విన్న పవన్ తన నవ్వు ఆపుకోలేక తెగ నవ్వాడట ఈ విషయాన్ని స్వయంగా అలీనే బయట పెట్టడంతో ఆ ఇంటర్వ్యూను చూసిన చాలామంది షాక్ అయి తెగ నవ్వుకున్నారు. 

దీనినిబట్టి చూస్తూ ఉంటే పవన్ అలీల మధ్య ఉండే సాన్నిహిత్యం బయటకు రావడమే కాకుండా పవన్ ఆ జోక్ ను ఎంత ఎంజాయ్ చేసాడో అర్ధం అవుతుంది. వాస్తవానికి పెళ్లి చేసుకోకుండా హిమాలయాలకు వెళ్లిపోయి సన్యాసం తీసుకుందామనుకున్న  పవన్ చేసుకున్న  పెళ్ళిళ్ళ పై జోక్ వేయగల సత్తా ఒక్క అలీకి మాత్రమే సొంతం అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: