చాలా గ్యాప్ తరువాత బ్లాక్ బ్యూటీ అమలాపాల్ ''ఆడై'' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా నిన్న రిలీజ్ అయిన ఈ చిత్రం ట్రైలర్ లో అమలాపాల్ న్యూడ్ గా కనిపించి యువత మతులు పోగొట్టింది. గాయాలైన శరీరంతో నూలుపోగు లేకుండా భయంతో వణికిపోతూ కూర్చున్న అమలాపాల్ నటించిన షాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. ఆ పాత్ర కోసం న్యూడ్ గా నటించడానికి కూడా వెనుకాడని అమలాపాల్ ను ఇప్పుడు అందరూ మెచ్చుకొంటున్నారు.
అయితే తాజాగా 'ఆడై' మూవీ గురించి అమలాపాల్ ట్వీట్ చేసింది. ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్స్ కోరుకునే ప్రేక్షకులకు మా ఈ ప్రయత్నం ఖచ్చితంగా నచ్చుతుందని ఎంతో ఆశతో ఉన్నాం. ఇక ఈ సినిమాకు కాన్సెప్ట్ రాణి అయితే, విజువల్స్ రాజు. ఈ రాజు, రాణిల గొప్ప వివాహం లాంటి "ఆడై" మూవీని త్వరలో చూస్తారంటూ ట్వీటింది ఈ బ్లాక్ బ్యూటీ.
మొత్తానికి తన న్యూడ్ షోతో సినిమాకు బాగానే పబ్లిసిటీ తెచ్చి పెట్టింది. కాగా ఈ సినిమాలో కామిని అనే పాత్రలో నటిస్తున్న అమలా పాల్, కొన్ని దారుణమైన పరిస్థితుల నుండి ఎలా బయటపడగలిగింది అనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. ముఖ్యంగా సినిమాలో స్క్రీన్ ప్లే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. మరి అమలాపాల్ కి ఈ సినిమా భారీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.