రామ్ చరణ్, వెంకటేష్ కాంబినేషన్ లో కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ కు మళ్ళీ గండం ఏర్పడినట్లు గా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈ సినిమా నుంచి వెంకటేష్ తప్పుకున్నాడని మళ్ళీ వార్తలు వస్తున్నాయి .అంతేకాదు వెంకీ ప్లేస్ లోకి శ్రీకాంత్ వచ్చి చేరారని తెలుస్తోంది.
జనవరి 2014 నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రం కుటుంబ అనుబంధాలు చుట్టూ తిరిగే ఈ సినిమాలో వెంకటేష్ ని కీలకమైన పాత్రలో అనుకున్నా. ఆయనకు సరిఅయిన హీరోయిన్ దొరక్కపోవటంతో వెంకటేష్ తప్పుకున్నట్లు ఫిలిం నగర్ లో వార్తల హడావిడి మొదలు అయింది. అదీకాక వెంకటేష్ ఎంత చెప్పినా రామ్ చరణ్ కే కథలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటం, బల్క్ డేట్స్ కావాలి అని వెంకటేష్ ను అడగటం ఈ సినిమానుండి వెంకి తప్పుకోవడానికి కారణం అని అంటున్నారు . ఈ నెలాఖరుకు మొదలు అయ్యి సంక్రాంతి నుంచి ఆస్ట్రేలియా షెడ్యూల్ తో సినిమా ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో ఆఖరు నిమిషం లో వెంకీ ఈ సినిమా నుండి తప్పుకోవడం ఈ సినిమాకు అనుకోని షా క్ అని అంటున్నారు.
ఈ చిత్రం స్టోరీ లైన్ హిందీ మూవీ 'కభి ఖుషీ కభి ఘమ్' స్టోరీని పోలి ఉంటుందట. ఏది ఏమైనా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి అని తెలుస్తోంద ఇప్పటికే 'తుఫాన్' పరాజయంతో షాక్ మీద ఉన్న రామ్ చరణ్ కు చాల నెలల తరువాత ప్రారంభం కాబోతున్న తన కొత్త మల్టీ స్టారర్ సినిమాకు వెంకటేష్ ఇచ్చిన షాక్ చరణ్ కు సినిమా ప్రారంభించ కుండానే వచ్చిన షాక్ అని అనుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి