మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘డిస్కోరాజా’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ఇక ఇటీవలె ఈచిత్రానికి సంబంధించి డిస్కోరాజా ఫ్రీకింగ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని ఈ చిత్ర యూనిట్ జరుపుకుంది. ఇదే రోజు రవితేజ పుట్టినరోజు కూడా అవ్వడం విశేషం. ఇక ఇదిలా ఉంటే..ఆ సినిమా ప్రెస్మీట్లో రవితేజ సినిమా గురించి పెద్దగా చెప్పుకునేందుకు కూడా ఇష్టపడలేదు. ఇక తన గురించి కూడా చెప్పుకునేందుకు ఏమీ లేక నా పాత్రకి మంచి పేరు వచ్చింది అని అంటూనే విలన్ పాత్రలో నటించిన బోబీ సింహా గురించి చెప్పాడు. మీ పాత్ర చాలా బావుందంటూ మా అబ్బాయికి మీ పాత్ర బాగా నచ్చేసిందన్నాడు. సేజ్ విలన్ పాత్రలో నటించిన బాబీ సింహా క్యారెక్టర్లో పెద్దగా సీన్స్ లేవు. మహా అయితే నాలుగైదు సీన్లున్నాయి. నాలుగైదు సీన్లకే పాత్ర బావుందంటూ మెచ్చుకున్నాడు రవితేజ.
అలాగే అబ్బూరిరవి నాకు చాలా చిత్రాలకు పని చేశారు. ఆయన నాకు ఫ్రెండ్ అని చెప్పాలి. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఆర్ట్ డైరెక్టర్నాగేంద్రగారు ఆయన కనిపించరు. కేవలం ఆయన పని మాత్రమే కనిపిస్తుంది. రాంకీగారు సింధూరపువ్వు సమయంలో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సునీల్ నేను ఇప్పటివరకు చాలా చిత్రాల్లో కలిసి నటించాం. కానీ ఈ చిత్రంలో మాత్రం చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో నటించాం. పాయల్ క్యారెక్టర్ చాలా బావుంటుంది. ఎంతో బాగా నటించింది. ఘట్టమనేని కార్తిక్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా బావుంది. తమన్ ప్రస్తుతం రాక్ స్టార్. ఇప్పుడు ఆయన సుక్రదశ తాండవం ఆడుతుంది. రామ్ తాళ్ళూరిగారు రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాలు పెద్దగా ఇష్టపడరు. ఆయన ఏదో ఒక కొత్తదనం కోరుకుంటారు అని అన్నారు.
దీంతో అందరూ చిత్రం ఫ్లాప్ కావడంతో సినిమా గురించి రవితేజ చెప్పడానికి పెద్దగా ఇష్టపడటం లేదంటూ అలాగే చెప్పుకోడానికి కూడా పెద్దగా ఏమీ లేదన్నట్టు ఒక హీరో విలన్ పాత్ర గురించి మాట్లాడటం కొత్తగా అనిపించింది. ఇక ఈ చిత్రంలో నభానషేష్, పాయల్రాజపుత్, తానియా, బాబిసింహా, v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సునీల్ తదితరులు నటించారు. రామ్‌తాళ్ళూరి నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పర్వాలేదనిపించుకుంటుంది.