యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో పోరాట యోధుడైన కొమరం భీమ్ పాత్రని పోషిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో సిద్ధమవుతున్న ఈ సినిమా యొక్క షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. అయితే ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంలోకి అడుగు పెడుతున్నాడని.. అది కూడా నందమూరి బాలకృష్ణ కోసమని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఇది నిజమో కాదో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం పూర్తయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా ప్రాజెక్టు గురించి ఒక అధికారిక ప్రకటనను విడుదల చేయనున్నారని ఇండస్ట్రీ నుండి టాక్ బలంగా వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం... తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన నెక్స్ట్ సినిమాని తీయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని హారిక హాసిని సంస్థ నిర్మిస్తుందని టాక్. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మూవీస్ అన్నీ(అతడు, అరవింద సమేత, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో) 'అ' అక్షరంతో మొదలయ్యే విధంగా టైటిల్ ని సెట్ చేస్తారు. అందుకే ఎన్టీఆర్ తో తీసే తన తదుపరి చిత్రానికి కూడా 'అ' అక్షరంతో మొదలు అయ్యే లాగా 'అయిననూ పోయిరావలె.. హస్తినకు' టైటిల్ ని రిజిస్టర్ చేయించారని సమాచారం.


ఇకపోతే ఈ సినిమాలో రష్మిక కథానాయకి పాత్ర లో నటించేందుకు సిద్ధమవుతుండగా.. ఎస్ తమన్ సంగీతం అందించనున్నాడు. సినిమా గురించి ఇంకొక ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మొదటిగా కామన్ మ్యాన్ గా కనిపించి తర్వాత రాజకీయంలోకి రంగ ప్రవేశం చేస్తారట. కథ ప్రకారం పొలిటీషియన్ అయిన బాలకృష్ణ తన తండ్రి అని తెలిసి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాడు. తర్వాత హస్తినాకి అనగా ఢిల్లీకి వెళ్లి రాజకీయం చేస్తారట. సెకండాఫ్ తర్వాత జరిగే ఈ సన్నివేశాల వలన సినిమా పూర్తిగా మారిపోతుందని సమాచారం. అయితే నిజజీవితంలో కూడా నందమూరి కుటుంబానికి, రాజకీయాలకి ఎప్పటి నుంచో సంబంధం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గత ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొని ఎంతో ఉత్సాహాన్ని ప్రజల్లో నింపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: