శృతిహాసన్ నటన పరంగానే కాకుండా ఎక్స్ పోజింగ్ విషయంలో కూడ చాల స్పీడ్ గా ఉంటుంది అని ఆమె బాలీవుడ్ లో నటించిన ‘డి-డే’ సినిమాను చుసిన వారికి ఎవరికైనా అర్ధం అవుతుంది. స్క్రిప్ట్ డిమ్యాండ్ చేస్తే తాను ఎటువంటి హాట్ సీన్స్ కు అయినా రెడీ అంటు శ్రుతి ఈ సినిమా ద్వారా బాలీవుడ్ కు సంకేతాలు ఇచ్చింది. ఈమె హాట్ పోజులు చూసి ఈమె తండ్రి కమల్ కూడా తట్టుకోలేకపోయాడు అంటే ఈ సినిమాలో శ్రుతి నటన రేంజ్ ఏ లెవల్ లో ఉందో అర్ధం అవుతుంది.  అయితే శ్రుతి ఇప్పుడు రంగాచారి అనే తమిళ నిర్మాతపై మండిపడుతోంది. అంతేకాదు ఆమె లీగల్ గా అతనిపై కేసు పెట్టడానికి రెడీ అవుతోంది. ఎందు కంటే ఆమె గత సంవత్సరం బాలీవుడ్ లో నటించిన 'డి-డే' సినిమాను తమిళంలో డబ్బింగ్ చేసి ‘దావూద్’ అనే టైటిల్ తో విడుదల చేస్తున్నందుకు. డి-డే నిర్మాతతో శ్రుతి చేసుకున్న ఎగ్రిమెంట్ లో ఆ సినిమా డబ్బింగ్ విషయమై ఆమె అనుమతి అవసరమవుతుందని ఉందని,దాన్ని రంగాచారి అతిక్రమించాడని ఆమె ఆరోపణ. నిఖిల్‌ అద్వానీ దర్శకత్వంలో రూపొందిన 'డి-డే'లో శృతి హాసన్ వేశ్య పాత్రను పోషించింది అన్న విషయం తెలిసిందే.  అర్జున్‌ రామ్‌పాల్‌ - శ్రుతిల మధ్య ఘాటైన సన్నివేశాలు అప్పట్లో ఈ సినిమాకు హాట్ టాపిక్ గా మారి సినిమాకు బోల్డ్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు దాన్నే క్యాష్ చేసుకుందామనే ఆలోచనతోనే నిర్మాత రామాచారి డబ్బింగ్ చేస్తున్నట్లు తమిళ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాకు దావూద్ అనే టైటిల్ పెట్టడం కూడా మిస్ లీడ్ అవుతుందని శ్రుతిహాసన్ గగ్గోలు పెడుతోంది. ఒక పాకిస్తానీ వేశ్యగా నటించిన సన్ని వేశాలను యధాతధంగా కోలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తే తన ఇమేజ్ కే కాకుండా కమలహాసన్ ఇమేజ్ కు కూడా ఈ సన్నివేశాలు ప్రతిభంధకంగా మారుతాయని శ్రుతి వాదన  కానీ విచిత్రం ఏమిటంటే బాలీవుడ్ లో శ్రుతి ఇమేజ్ కు రాని డేమేజ్ ఇదే సినిమాను కోలీవుడ్ లో విడుదల చేస్తే శ్రుతికి ఎందుకు అంత ఖంగారు అంటు కోలీవుడ్ మీడియా రాతలు రాస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: