సినీ ఇండస్ట్రీలలో ఇప్పుడు ప్రొడక్షన్ హౌజ్ లు చాలా ఎక్కువ అవుతున్నాయి. దీనికి కారణం ఒక్కో హీరో ఒక్కో ప్రొడక్షన్ హౌజ్ని ఏర్పాటు చేసుకోవడమే. ఈ ప్రొడక్షన్ హౌజ్ గోల ఒక్క ఇండస్ట్రీకి మాత్రమే కాదు. భారత దేశంలో ఉన్న ప్రతి సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇది కొనసాగుతుంది. దీనికి కారణం వారు నటించిన సినిమాలను వారే నిర్మించడం కోసం వారు సొంత ప్రొడక్షన్ హౌజ్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. 

 

 


ఇవి ముఖ్యంగా దక్షిణాన, మరి ముఖ్యంగా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో కూడా హీరోలు సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ పెట్టుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా టాలీవుడ్ లో  హీరోలు సొంత కుంపటిని ఏర్పాటు చేసుకున్నారు. ఇదివరకే మహేష్ GMB అనే పేరుతో ఓ ప్రొడక్షన్ హౌజ్‌ను పెట్టుకున్న సంగతి తెలిసిందే. అలానే నాని కూడా "వాల్ పోస్టర్" అంటూ అయన సపరేట్ గా పెట్టుకున్నాడు. అలాగే రామ్ చరణ్ కూడా "కొణిదెల" కంపెనీ అంటూ వారి స్టైల్ లో స్టార్ట్ చేశాడు. ఈ బ్యానర్ లోనే "సైరా" సినిమాను ఆ కంపెనీలోనే తీసిన సంగతి అందరికి తెలిసిందే. 

 

 


అలాగే కుర్ర హీరో విజయ్ దేవరకొండ కూడా "కింగ్ ఆఫ్ ది హిల్" అని, ఇలా చిన్న, పెద్ద హీరోలు సొంత కుంపటి పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ లిస్ట్ లో చేరి పోయాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో #RRR సినిమా జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగా ఉండగా మరి అందులో కూడా ఎన్టీఆర్ ఈ సారి వాటా తీసుకున్నారని సమాచారం తెలుస్తుంది. 

 

 


సమాచారం అందుతున్న మేరకు ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ పేరు మీద ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించాలని ఆలోచన ఉన్నారట జూనియర్ ఎన్టీఆర్. దీనికి నందమూరి హరికృష్ణ ఆర్ట్స్ పేరుతో ఆయన ఒక బ్యానర్ స్థాపించాలనే ఆలోచనలో ఉన్నారట జూనియర్ ఎన్టీఆర్. ఇకపై త్రివిక్రమ్ సినిమా తర్వాత నుండి ఎన్టీఆర్ తాను నటించబోయే ప్రతి సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉండాలని ఆయన అనుకుంటున్నారట. ఇక ముందట సినీ హీరో ఎన్టీఆర్ నటించే అన్ని సినిమాలు ఈ NHK బ్యానర్ లో రూపొందనున్నాయని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: