అయితే తాజాగా బాలీవుడ్ నిర్మాత రమేష్ తౌరని సుశాంత్ మరణం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ మరణించే ఒక్కరోజు ముందు తనతో ఫోన్ మాట్లాడినట్లు నిర్మాత రమేష్ తౌరని గుర్తుచేసుకున్నారు. ఒక సినిమా గురించి చర్చించేందుకు మరో నిర్మాత అయిన నిఖిల్ అద్వానీ తో కలిసి... సుశాంత్ ఆత్మహత్య చేసుకునే ముందు రోజు... కాన్ఫరెన్స్ కాల్ లో సంభాషించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. మధ్యాహ్నం సమయంలో సుశాంత్ తో కలిసి కాన్ఫరెన్స్ మాట్లాడినట్లు తెలిపిన నిర్మాత తౌరని... అతని మేనేజర్ ఉదయ్ కూడా తమతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు.
అయితే ఒక సినిమా గురించి చర్చించేందుకు కాల్ మాట్లాడినప్పటికీ సుశాంత్ మనసులో ఉన్న భావాలను మాత్రం తాను అర్థం చేసుకోలేకపోయాను అంటూ నిర్మాత రమేష్ తౌరని ఆవేదన వ్యక్తం చేశారు. మా మధ్య 15 నిమిషాల పాటు కొనసాగిన సంభాషణ కేవలం సినిమా గురించి మాత్రమే కొనసాగింది అంటూ తెలిపారు, ఆ తర్వాత సుశాంత్ మరణవార్త విని ఎంతగానో షాక్ కి గురయ్యాను అంటూ తెలిపారు నిర్మాత రమేష్ , ఒక సుశాంత్ మరణంపై వాస్తవాలు వెలువడే వరకు ఎంతో ఓపికతో ఉండాలని... ఇండస్ట్రీ గురించి తప్పుగా ప్రచారం చేయొద్దు అంటూ విజ్ఞప్తి చేశారు . కాగా ప్రస్తుతం సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తులు కీలక విషయాలు బయటపడుతున్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి