ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బకి దేశవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమ ఎంతో దెబ్బతిన్న విషయం తెలిసిందే. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలు సహా అన్నీ కూడా నష్టాల్లో కూరుకుపోవడంతో పాటు ఎన్నో సినిమాలు మధ్యలోనే చిత్రీకరణ ఆపేసాయి. ఇక ఎట్టకేలకు ఇటీవల సినిమా షూటింగ్స్ కి ప్రభుత్వం అనుమతి ఇవ్వటం ఆపై మెల్లగా ఒక్కొక్క సినిమా యూనిట్ తన షూటింగ్స్ ని మొదలు పెట్టడం జరిగింది. అయితే వాటిని కూడా ఎంతో జాగ్రత్తగా పలుసేఫ్టీ మెజర్స్ తీసుకొని మరీ చిత్రీకరిస్తున్నారు.

ఇక మరికొద్ది రోజుల్లో థియేటర్స్ కూడా ఓపెన్ కానున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ  ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మాట్లాడుతూ అతి త్వరలో పలు జాగ్రత్తలతో అలానే 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో ధియేటర్స్ తెరుచుకోవచ్చని అలానే వెసులుబాటును బట్టి పలువురు థియేటర్ల యజమానులు షోలను పెంచుకోవటం, టికెట్ల ధరలు కూడా పెంచుకునే అవకాశం కూడా ఆయన కల్పించారు. వాటితో పాటు మరికొన్ని రాయితీలను కూడా కెసిఆర్ ప్రకటించడం జరిగింది. ఈ విధంగా సీఎం కేసీఆర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ పై ఒక్కసారిగా వరాల జల్లు కురిపించడంతో పలువురు సినిమా ప్రముఖులు నిన్నటి నుంచి ఆయనకి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అలానే పత్రికల ద్వారా కృతజ్ఞతలు తెలుపుతు న్నారు.

మరోవైపు ఇప్పటికే పలు టాలీవుడ్ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇక పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి సినిమా థియేటర్స్ వచ్చే నెల 7న పక్కాగా ఓపెన్ అవుతాయని, త్వరలో దానికి సంబంధించి సినిమా పరిశ్రమలో, అలానే థియేటర్స్ ఓనర్స్ మధ్య చర్చ జరగనుందని అంటున్నారు. అయితే అది 50 శాతం మాత్రమే సీటింగ్ తో మొదలవుతాయని అలానే పక్కాగా జాగ్రత్తలు తీసుకొని ఆడియన్స్ ని థియేటర్స్ లోకి అనుమతించటం జరుగుతుందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారమవుతోన్న ఈ వార్త నిజమే అయితే మరొక రెండు వారాల్లో హ్యాపీ గా ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమాలు చూడవచ్చు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: