ఇండియా హెరాల్డ్  అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... రామ్ గోపాల్ వర్మ... సంచనాలకు మారు పేరు. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్... ఆయన రూటే సపరేటు... మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడడు.. మనసులో ఏదైనా అనిపించింది అంటే టక్కున పైకి చెప్పేస్తాడు.. ఇక అమ్మాయిల విషయంలో అయితే మరీ రామ్ గోపాల్ వర్మ చాలా చురుకు .. అందమైన అమ్మాయి అయితే ఇంకా ఫాస్ట్.. ఆ అందమైన అమ్మాయి యాంకర్ అయితే ఇంకేముంది పులిహోర మాములుగా కలిపడు.

వర్మ ఇంటర్వ్యూల ముచ్చట్లలోకి వెళ్తే .. ఎక్కువగా అమ్మాయిలకే ఇంటర్వ్యూ ఇస్తుంటాడు..వర్మని ఇంటర్వ్యూ చేయడం ద్వారా పాపులర్ అయిన లేడీ యాంకర్లు లిస్ట్ చాలానే ఉంది. బిగ్ బాస్ హౌస్‌లో టాప్ 5 అడుగుదూరంలో ఉన్న అరియానా గ్లోరీని బోల్డ్ యాంకర్‌గా మార్చింది వర్మనే. నిన్ను బికినీలో చూడాలని ఉంది.. సినిమా తీస్తా వస్తావా? అని ఇంటర్వ్యూలో డైరెక్ట్‌గా అడిగేసి ఆమెను పాపులర్‌ని చేసి బిగ్ బాస్ రియాలిటీ షోలో ఛాన్స్ వచ్చేలా చేసిన ఘనత  వర్మదే.ఇక రామ్ గోపాల్  వర్మ ‘కరోనా’ మూవీ విడుదలకు రెడీ కావడంతో ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ వర్మని ఇంటర్వ్యూ చేసింది.


నిజంగా ఆమె అందమే నచ్చిందో.. లేక ఆమె ప్రశ్నలడిగే విధానం నచ్చిందో తెలియదు కానీ.. వర్మ మాత్రం గట్టిగానే పులిహోర కలుపేసాడు.దీంతో వర్మ ఖాతాలో మరో యాంకర్ పాపులర్ అవుతుంది. ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: