సంక్రాంతి కానుకగా వచ్చిన మాస్ మహరాజ్ రవితేజ తాజా చిత్రం " క్రాక్".  ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మాస్ మహారాజ్ గత కొంత కాలంగా వరుస ఫ్లాఫ్ లతో స్టార్ రేస్ లో చాలా వెనకబడ్డాడు. దీంతో రవితేజ కెరియర్ పూర్తి డైలమా లో ఉన్న తరుణంలో  "క్రాక్ " సినిమాతో ఫుల్ మిల్స్ లాంటి హిట్ కొట్టాడు. 

సినిమా రవితేజ కెరియర్ లోనే టాప్ గ్రాసర్ కలెక్షన్ల వైపుగా దూసుకుపోతుంది. ఈ సినిమా భారీ విజయంతో రవితేజ తరువాతి సినిమా " ఖిలాడి" పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో ఖిలాడి సినిమా నుండి సంక్రాంతి కానుకగా కొత్త పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా నుండి ఇంతకు ముందు విడుదలైన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది.

అలాగే నేడు మరో పోస్టర్ కూడా సిని ప్రేక్షకుల్లో ఆసక్తి ని పెంచుతుంది. ఈ పోస్టర్ లో మాస్ మహారాజ్ రవితేజ తో పాటు మీనాక్షి, డింపుల్ హయాతి ముగ్గురు కనిపించారు. అయితే రవితేజ కూల్ అండ్ స్టైలిష్ లూక్స్ తో అక్కట్టుకుంటున్నాడు. అలాగే హీరోయిన్స్ పోస్టర్ లో గ్లామర్ తో అదరగొడుతున్నారు.సినిమా రమేష్ వర్మ దర్శకత్వంలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ సినిమా విడుదలకు సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: