ఫిదా సినిమా ద్వారా  తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి.. తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫిదా సినిమాలో తెలంగాణ భాష తో మాట్లాడుతూ అదరగొట్టేసి, నిజంగానే హైబ్రిడ్ పిల్లా అనిపించుకుంది. తను చేసిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తో  ముందుకొస్తుంది. ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా  సీడీపీ ని విడుదల చేశారు మేకర్స్..
సాయి పల్లవి తన డాన్స్ తోనే కాకుండా, తన అందంతో కూడా అందరిని ఆకట్టుకుంటుంది. సాయిపల్లవి నటిగా అడుగుపెట్టిన 5 సంవత్సరాల్లోనే ఎన్నో సినిమాలలో నటించి, ఏకంగా 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులకు నామినేట్ అయ్యి, 11 అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత నాని సరసన ఎంసీఏ చిత్రంలో నటించింది. అలాగే కణం, మారి 2 వంటి సినిమాలలో నటించింది.



పడి పడి లేచే మనసు సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మరోసారి తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా, లవ్ స్టోరీ సినిమాలో నటిస్తోంది ఈ భామ. ఈ సినిమా నుంచి విడుదలైన సారంగదరియా పాటకు కేవలం 32 రోజుల్లోనే  100 మిలియన్ల వ్యూస్ ను సాధించి, రికార్డు సృష్టించింది. అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ  మంచి డాన్సర్ అని కూడా నిరూపించుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు సాయి పల్లవి విరాటపర్వం అనే సినిమాలో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత మరిన్ని కథలు వినడానికి సిద్ధమవుతోంది సాయి పల్లవి.

అలాగే నాని సరసన సాయిపల్లవి శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ  సినిమాను విడుదల చేయకుండా వాయిదా వేశారు. అలాగే తను నటించబోతున్న సినిమాలలోని అప్డేట్స్, ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా రానున్నాయి.  అయితే సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా అభిమానులు రిలీజ్ చేసిన పోస్టర్ ఏంటో మీరు కూడా చూసేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: