
ఈ ప్రోమోలో రష్మీ నాకు సుధీర్ గారికి రెండు ఇవ్వాలని ఉందని చెప్పగా పూర్ణ సుధీర్ అంటూ నవ్వుతూ గట్టిగా అరుస్తారు. ఆ తరువాత హైపర్ ఆది రష్మీ సుధీర్ కు ఇవ్వబోయే ఆ రెండూ ఏంటో తెలియాలని అన్నారు. రష్మీ హేయ్ రా అంటూ సుధీర్ ను స్టేజ్ పైకి పిలవగా సుధీర్ స్టేజ్ పైకి వస్తారు. ఫస్ట్ పర్ఫామెన్స్ సూపర్ అంటూ రష్మీ సుధీర్ కు హగ్ ఇవ్వగా రష్మీ చేసిన పనితో టీమ్ లీడర్స్ తో పాటు కంటెస్టెంట్లు సైతం అవాక్కవుతారు.
ఇక ఆ తరువాత రష్మీ సుధీర్ చెంప పగులగొడతారు. రష్మీ వెంటనే సుధీర్ ను కొట్టడానికి గల కారణం చెబుతూ సుధీర్ కు కాలు బాగాలేదని అయినప్పటికీ జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సుధీర్ ఎప్పటికీ వెనుకాడడని రష్మీ చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఆది తాను దీపికా పిల్లికి రెండు ఇవ్వాలని అనుకుంటున్నానని డ్యాన్స్ బాగా చేసినందుకు దీపికా పిల్లికి హగ్ అని ఆ తరువాత దీపికా పిల్లికి చెయ్యి బాగాలేదని చెబుతూ హైపర్ ఆది నవ్వించారు. ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు సుధీర్ పై ఉన్న ప్రేమను రష్మీ హగ్ చేసుకొని బయటపెట్టారని కామెంట్లు చేస్తున్నారు. సంవత్సరం సంవత్సరానికి రష్మీ సుధీర్ జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.