విజయ్ సేతుపతి ప్రస్తుతం తమిళం, తెలుగు అలాగే హిందీ భాషల్లో కూడా చేస్తూ పదుల సంఖ్యలో మూవీలను లైన్‌లో పెట్టి ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇక వీటిల్లో కొన్ని షూటింగ్ దశలో ఉంటే మరికొన్ని సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో, ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయని సమాచారం. ఇక అత్యంత ట్యాలెంట్ ఉన్న విలక్షనమైన యాక్టర్‌గా విజయ్ సేతుపతికి పేరుంది. ఈ కారణం వల్లనే ఆయనకు అన్ని సినిమా ఆఫర్లు వస్తున్నాయి.
అయితే విజయ్ కేవలం సినిమాలే కాకుండా అటు వెబ్ సిరీస్‌లలో కూడా చేస్తున్నారు. ఇంకోవైపు టీవీ షో లతో పాటు వెబ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నఈ మక్కల్ సెల్వన్ చేతిలో ఏకంగా పాతిక ప్రాజెక్ట్ లను పెట్టుకుని ఫుల్ బిజీగా మారాడు. కాగా ఇప్పటి దాకా ఒక నటుడు గానీ లేదా హీరోగానీ ఇన్ని ప్రాజెక్టులు ఒకే సమయంలో చేసి ఉండడు. అందుకే విజయ్ సేతుపతి ఇప్పుడు ఫుల్ బిజీగా మారాడు.
ఇక విజయ్ ప్రస్తుతం కొన్ని మూవీలను కూడా సొంతంగా నిర్మిస్తూ బిజినెస్ చేస్తున్నాడు. ఇదే సమంయలో ఆయన నటిస్తున్న మూవీలకు కాకుండా కొన్ని వేరే సినిమా లకు కూడా రచన సహకారం చేస్తూ ఉంటాడు. మొత్తానికి విజయ్ సేతుపతికి ఒక సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలపై పట్టు ఉండటం ఇండియాలోనే ఏ నటుడు చేయనన్ని సినిమాలు ఒకే సారి చేయడం చాలా అరుదైన రికార్డుగా చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి