సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ లు స్టార్ లుగా ఎదగాలని ఎన్నో కలలు కంటూ ఇండస్ట్రీ కి వస్తారు కానీ వారికి అదృష్టం లేక సినిమా అవకాశాలు లేక నార్మల్ హీరోయిన్ గానే మిగిలిపోతున్నారు. పదిమందిలో ఒకరు గాని స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం రాదు. మిగతా వారందరూ ఒకటి రెండు సినిమాలతో వచ్చి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై పోతారు. ఆ విధంగా ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్ లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నార . వారిలో కొందరు స్టార్ హీరోయిన్ లు అయితే మరి కొందరు ఒకటి రెండు సినిమాలకే పరిమితమై ఇండస్ట్రీ ను వదిలేస్తున్నారు.

 గతంలో చాలామంది హీరోయిన్లు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వారే. ఏదో ఒక రకంగా వారికి దురదృష్టం వెంటాడి వారిని స్టార్ హీరోయిన్ అవ్వకుండా చేస్తుంది.  అలా అల్లరి నరేష్ హీరోగా నటించిన బెట్టింగ్ బంగార్రాజు సినిమా హీరోయిన్ నిధి స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కారణాలేవైనా ఆమె ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసి దూరం అయింది. ఆ సినిమా తరువాత మరో తెలుగు సినిమాలో నటించలేదు నిధి. దాంతో ఆమె ఏమైందో ఎక్కడికి వెళ్లిందో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. 

ఇ.సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా తరువాత ఆమెకు చిన్న చిన్న సినిమా అవకాశాలు మాత్రమే వచ్చాయి. రణం 2 సినిమా లో ఈమె నటించిన కూడా పెద్దగా పేరు రాలేదు ఆమెకు. ఈ సినిమాతో ఆమె పూర్తి గా ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.  ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈమె ప్రస్తుతం బిజినెస్ రంగంలో బిజీగా ఉంది.  మరోపక్క ఆమె రీ ఎంట్రీ గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం గుర్తింపు లేని ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇస్తే మాత్రం మళ్లీ పాత కథే పునరావృతం అవుతుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: