సినీ సెలబ్రిటీలలో ప్రేక్షకులకు తెలియని ఒక గొప్ప మనసు దాగి ఉంటుంది అన్న విషయం కరోనా వైరస్ కష్టకాలంలో సోనూ సూద్ ని చూస్తే అర్ధమయింది.  ఎప్పుడూ విలన్ పాత్రలు చేస్తూ..  పాత్రల్లో రాక్షసానందం పొందుతూ..  అటు సినీ ప్రేక్షకులు అందరికీ ఒక చెడ్డ వ్యక్తిగానే సోనూ తెలుసు.  సినిమాల్లో ఉన్నట్లుగానే సోను సూద్ బయట గా ఉంటారు అని అనుకున్నారు.  ఇక అందరూ అతన్ని విలన్ లాగా చూసారు కానీ అలాంటి విలన్ కే ఎంతో గొప్ప మనసు ఉంది అనేది ఈ కరోనా వైరస్ కష్టకాలంలో అర్థమైంది. ఎంతోమందికి ఆపద్బాంధవుడిగా మారిపోయిన సోను సూద్ కోట్ల రూపాయల సహాయం చేసి కలి కాలంలో ప్రత్యక్ష దేవుడి గా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇలా సోను సూద్ మాత్రమే కాదు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు గొప్ప మనసు చాటుకున్నారు.  ఇక ప్రేక్షకులు సినీ సెలబ్రిటీల గురించి పెట్టుకుని ఒక భావన సరైనది కాదు అని తమ గొప్ప మనసుతో రుజువు చేశారు.  ఇక ఇటీవలే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి రెండు వారాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన సీరియల్ నటి ఉమాదేవి కూడా గొప్ప మనసు చాటుకున్నారు.  ఇటీవలే బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తరచూ కంటెస్టెంట్స్ తో గొడవలు పడుతూ..  కొన్నిసార్లు బూతులు మాట్లాడటం కూడా చేసింది ఉమాదేవి. దీంతో కొంతమంది సినీ ప్రేక్షకుల్లో ఉమాదేవి అంటే మంచిది కాదేమో అన్న భావన వచ్చింది. కానీ ఇప్పుడు ఉమాదేవి చేసిన పని తెలిస్తే మాత్రం చేతులెత్తి మొక్కుతారు.



 ఇటీవలే రెండో వారంలో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఉమాదేవి తన రెమ్యునరేషన్ను ఒక మంచి పని కోసం ఉపయోగించింది  బిగ్ బాస్ షో ద్వారా తనకు వచ్చిన పారితోషికం లోని కొంత మొత్తాన్ని బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారికి ఆదుకునేందుకు సాయం చేసింది ఉమాదేవి. ఇక ఇప్పుడు బిగ్బాస్ ఫేమ్ ఉమాదేవి గొప్ప మనసు పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ షోలో భాగంగా మొదటి వారంలో సరయు ఎలిమినేట్ కాగా.. ఇక రెండవ వారంలో తక్కువ ఓట్లు రావడంతో ఉమాదేవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చింది అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: