‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ పూర్తి కావడంతో ఈమూవీ ఫైనల్ కాపీ రెడీ పెట్టే పనిలో ప్రస్తుతం రాజమౌళి బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డ ఈ మూవీని ఎట్టి పరిస్థితులలోను జనవరి 7న విడుదల చేయాలి అని గట్టి పట్టుదల మీద ఉన్న జక్కన్నకు ఈ మూవీకి సంబంధించిన 18 వందల సీజీ షాట్స్ ఊహించని షాక్ ఇచ్చినట్లు సమాచారం.

 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ లో సుమారు 18 వందల సీజీ షాట్స్ ఉన్నట్లు టాక్. వీటిని ఏ విషయంలో రాజీ పడకుండా ‘బాహుబలి’ రేంజ్ లో గ్రాఫిక్స్ వర్క్స్ ఉండాలని రాజమౌళిగ్రాఫిక్స్ పనిని పర్యవేక్షిస్తున్న మూడు ప్రముఖ కంపెనీలకు చెప్పినట్లు తెలుస్తోంది.

 

 అయితే ఇక ఈసినిమా విడుదలకు ఇక కేవలం 100 రోజులు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులలో అంత వేగంగా పూర్తి చేస్తే గ్రాఫిక్స్ క్వాలిటీ దెబ్బతినే ఆస్కారం ఉందని అందువల్ల తమకు తగిన సమయం ఇవ్వమని ఆ గ్రాఫిక్ కంపెనీలు రాజమౌళికి సున్నితంగా సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమూవీ ఖచ్చితంగా జనవరి ఏడున విడుదల చేసి తీరాలని భావిస్తున్న రాజమౌళికి ఇప్పుడు ఆ ప్రముఖ సీజీ కంపెనీలు చెప్పిన సూచన ఏమాత్రం కొరుకు పడటం లేదని తెలుస్తోంది.

 
దీనికితోడు క్వాలిటీ విషయంలో రాజమౌళి రాజీపడలేడు కాబట్టి ఈ సీజీ వర్క్ ను మరో విదేశీ కంపెనీకి కూడ అప్పచెప్పి ఆ కంపెనీకి కూడ కొంత వర్క్ ఇచ్చి ఏదోవిధంగా జనవరి 7వ తారీఖున ఈమూవీని విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరొకసారి ఈసినిమా విడుదల వాయిదా పడితే ఈమూవీ బయ్యర్ల నుండి తీవ్ర ప్రతిఘటనతో పాటు ఈమూవీకి ఇప్పటికే ఏర్పడ్డ క్రేజ్ కు నష్టం జరిగే ఆస్కారం ఉండటంతో ఎలా ఈ సమస్యను పరిష్కరించి సంక్రాంతి ముందే ‘ఆర్ ఆర్ ఆర్’ తీసుకు రావాలి అన్న అంతర్మధనంలో జక్కన్న ఉన్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: