నందమూరి నటసింహం బాలకృష్ణ-బోయపాటి శ్రీను  కాంబినేషన్‌లో వచ్చిన 'సింహ' 'లెజెండ్' సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా `అఖండ` చిత్రం మంచి ఘన విజయం సాధించి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. స్టార్టింగ్ నుంచి టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను కుమ్మింది. ఇక ఈ సినిమా 32వ రోజున కూడా చాలా బాగానే రాణించింది. 'పుష్ప' 'శ్యామ్ సింగరాయ్' వంటి పెద్ద సినిమాలు ఈ సినిమాకి పోటీగా ఉన్నప్పటికీ… న్యూ ఇయర్ హాలిడేస్ ను కూడా 'అఖండ' సినిమా చాలా బాగానే వాడుకుంది.ఇక 'ద్వారకా క్రియేషన్స్‌' బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలయ్యి మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో అదిరిపోయే ఓపెనింగ్స్ తో ఆశ్చర్య పరిచి భారీ వసూళ్లనే రాబట్టింది.ఇక దీంతో 8రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 32 రోజుల కలెక్షన్ల వివరాలను కనుక ఓసారి గమనిస్తే...'అఖండ' సినిమానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగింది.

ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను ఖచ్చితంగా రాబట్టాలి. 8 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ సినిమా ఇక కరెక్ట్ గా 32 రోజులు పూర్తయ్యేసరికి… రూ.70.85 కోట్ల షేర్ ను అవలీలగా రాబట్టింది.ఇక ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ.16.85 కోట్ల భారీ లాభాలు దక్కాయి. న్యూ ఇయర్ హాలిడేస్ ను కూడా ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుని భారీగా లాభాలను దక్కించుకుంది. ఇక ఈ సినిమా అటు బాలయ్య కెరీర్ లోనూ ఇటు బోయపాటి కెరీర్ లోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. బాల కృష్ణ రెండు పాత్రల్లో నటించాడు.అందులో ఒకటి అఘోరా పాత్ర కాగా రెండోది రైతు పాత్ర .యస్ యస్ థమన్ ఈ సినిమాకి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయే పాటలు అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: