దర్శకుడు
రమేష్ వర్మ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనప్పటికీ
సినిమా ఇండస్ట్రీలో మాత్రం దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు.
రవితేజ హీరోగా నటించిన వీర చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ దర్శకుడు ఆ
సినిమా ఫ్లాప్ అవ్వడం ఆయన పేరు బయట ఎవరికీ పెద్దగా తెలియకుండా పోయింది. ఆ చిత్రం హిట్ అయితే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. ఆ విధంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా చేజేతులా నేలపాలు చేసుకున్నాడు రమేష్ వర్మ.
వీర చిత్రం తర్వాత కొన్ని సినిమాలతో మళ్లీ హిట్ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఆ సినిమాలేవీ కూడా ఆయనకు మంచి ఫలితాన్ని ఇవ్వలేదు దీంతో మళ్లీ
రవితేజ తో హీరోగా
సినిమా చేయాలని ఆయన చాలా ప్రయత్నాలు చేశారు.
రవితేజ ఖాళీగా లేకపోవడం వల్ల అంత తొందరగా ఆయన ఆయనకు
సినిమా ఇవ్వలేకపోయాడు. ఎట్టకేలకు ఈ సినిమాతో మరో అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఈ అవకాశాన్ని అసలు జారవిడిచి కూడదు అని చెప్పి తప్పకుండా మంచి
సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించాలని
రమేష్ వర్మ భావించి ఈ కథను
రవితేజ కు చెప్పి ఆయనతో ఒప్పించాడు.
వాస్తవానికి ముందుగా ఈ దర్శకుడితో
రవితేజ కిలాడి
సినిమా చేయాలనుకోలేదట ఇప్పటికే తమిళంలో సూపర్ హిట్ అయిన శతురంగ వెట్టై 2 అనే సినిమాను
రమేష్ వర్మ దర్శకత్వంలో చేయాలని భావించాడు రవితేజ. కానీ స్క్రిప్ట్ దశలో ఆ చిత్రం యొక్క
హీరో కథకు తన బాడీ లాంగ్వేజ్ సరిపోదు అని తెలుసుకున్న
రవితేజ ఆ చిత్రాన్ని చేయవద్దని భావించాడట. దీంతో ఈ సినిమా ఎక్కడ పోతుందో అని
రమేష్ వర్మ అదే సమయానికి తన వద్ద ఉన్న ఈ ఖిలాడి కాన్సెప్ట్ ను వినిపించగా ఈ
సినిమా చేయడానికి
రవితేజ ఒప్పుకున్నాడట ఆ విధంగా
రవితేజ సినిమా ఇప్పుడు
ఫిబ్రవరి 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యింది.