అందాల ముద్దుగుమ్మ నిత్యా మీనన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యా మీనన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలా మొదలైంది మూవీ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది . నిత్యా మీనన్ ఆ తర్వాత ఇష్క్ , గుండెజారి గల్లంతయ్యిందే మూవీ లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.  ఇది ఇలా ఉంటే నిత్యా మీనన్ తన కెరియర్ లో కమర్షియల్ సినిమాలకు ,  గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న మూవీ లలో మాత్రమే నటిస్తూ వస్తోంది.  

ఇది ఇలా ఉంటే తాజాగా నిత్యా మీనన్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా నటించి ప్రేక్షకులను అలరించింది. భీమ్లా నాయక్ సినిమాలో నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నటించింది.  ఇది ఇలా ఉంటే నిత్యా మీనన్ 'బ్రీత్ ఇన్ టు ద షాడోస్'  అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది.  ఇది ఇలా  ఉంటే ప్రస్తుతం నిత్యా మీనన్ ఒక షో కు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.  

ఇది ఇలా ఉంటే అందాల ముద్దుగుమ్మ నిత్యా మీనన్ తాజాగా సొంతగా ఒక యూట్యూబ్ ఛానల్ ను  ప్రారంభించింది.  నిత్య మీనన్ తన యూట్యూబ్ ఛానల్ కు నిత్య అన్‌ఫిల్టర్డ్ అనే పేరును పెట్టుకుంది. నిత్య మీనన్ తన 12 ఏళ్ల సినిమా కెరియర్  సంబంధించిన విషయాలను ఫస్ట్ వీడియోలో షేర్‌ చేస్తూ తన వ్య‌క్తిగ‌త‌,వృత్తిప‌ర‌మైన జీవిత విశేషాల‌పై మ‌రిన్ని వీడియో లతో మరి కొన్ని రోజుల్లోనే మీ ముందుకు రాబోతున్నానంటూ ఈ ముద్దుగుమ్మ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: