బాలకృష్ణ సినిమాల్లో డబుల్, త్రిబుల్ రోల్స్‌లో కనిపించడం చాలా కామన్. అఖండ సినిమాలో అఘోరా, రైతు పాత్రలతో మెప్పించిన బాలయ్య నెక్ట్స్‌ గోపీచంద్ మలినేని సినిమాలో కూడా రెండు షేడ్స్‌తో కనిపించబోతున్నాడు. రీసెంట్‌గా వచ్చిన పోస్టర్‌లో బాలకృష్ణ పంచె కట్టులో కనిపించినా... సర్‌ప్రైజింగ్‌ లుక్‌ మరొకటి ఉందని, ఫ్లాష్‌ బ్యాక్‌లో అల్ట్రామోడ్రన్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది.

శంకర్‌, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో ఒక పొలిటికల్‌ థ్రిల్లర్‌ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చరణ్‌ ఐఏయస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్‌తో సూటు, బాటుతో బ్యూరోక్రాట్‌గానే కనిపించాడు. అయితే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కి ఒక ఫ్లాష్‌ బ్యాక్‌ ఉంటుందని అందులో చరణ్‌ స్టూడెంట్‌ లీడర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది.

రవితేజ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమా విక్రమార్కుడు. విక్రమ్‌ రాథోడ్, అత్తిలి సత్తిగా డబుల్‌ యాక్షన్‌తో అదిరిపోయే హిట్‌ కొట్టాడు. ఇప్పుడు ధమాకా సినిమాతోనూ అదే రిజల్ట్‌ని రిపీట్‌ చేయడానికి ఫ్లాష్‌బ్యాక్‌లకి వెళ్తున్నాడు రవితేజ. 'ధమాకా'లో రవితేజ క్యారెక్టర్‌లో రెండు వేరియేషన్స్‌ ఉంటాయని, ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్స్‌ ఉంటాయని సమాచారం.

కళ్యాణ్‌ రామ్‌ సరైన హిట్‌ కోసం చాన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్నాడు. 'పటాస్' తర్వాత కళ్యాణ్‌ రామ్‌కి వరుస ఫ్లాపులొచ్చాయి. ఆరు డిజాస్టర్లతో కళ్యాణ్‌ రామ్‌ మార్కెట్‌ కూడా పడిపోయింది. ఇలాంటి టైమ్‌లో 'బింబిసార' అనే సినిమా చేశాడు. హిస్టారికల్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ నాటి బింబిసారుడిగా, నేటి మోడ్రన్‌ యూత్‌గా రెండు రకాల ప్రాతలు పోషించాడు.

అక్కినేని ఫ్యామిలీకి 'మనం'తో మెమరబుల్ మూవీ ఇచ్చాడు విక్రమ్‌ కుమార్. అక్కినేని అభిమానులు కూడా ఎప్పుడూ గుర్తుంచుకునే సినిమా తీసిన విక్రమ్‌, నాగచైతన్యతో 'థ్యాంక్యూ' అనే సినిమా తీశాడు. ఈ మూవీలో చైతన్య మల్టిపుల్ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ ప్లే చేస్తున్నాడని సమాచారం. శ్రీ విష్ణు 'అప్పట్లో ఒకడుండేవాడు' అనే సినిమాలో రెండు షేడ్స్‌లో కనిపించాడు. ఆ రోజుల్లో మరి క్రికెటర్‌ కావాల్సిన వాడినని ఒక ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీ చెప్పాడు. ఇక ఇప్పుడు సెట్స్‌లో ఉన్న ఒక సినిమాలో శ్రీ విష్ణు ట్రిపుల్‌ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తోంది. ముగ్గురు మొనగాళ్లు రేంజ్‌లో డిఫరెంట్‌ స్టైల్స్‌ చూపిస్తాడని ప్రచారం జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: