టాలీవుడ్ హీరోలలో ఒకరు అయిన నందమూరి కళ్యాణ్ రామ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్,  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అతనొక్కడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకొని మాస్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు. అతనొక్కడే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత హరే రామ్ ,  పటాస్ , 118 వంటి విజయవంతమైన సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.  

కళ్యాణ్ రామ్ హీరోగా మాత్రమే కాకుండా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలను కూడా నిర్మిస్తూ ఉంటాడు.  ఇప్పటికే ఈ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ అనేక సినిమాలను నిర్మించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ ఈ బ్యానర్ లో  రెండు పాన్ ఇండియా సినిమాలను నిర్మించబోతున్నారు.  ఈ రెండు సినిమా ల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ హీరో కావడం విశేషం.  జూనియర్,  ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాను యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నాడు.

ఈ మూవీ తో పాటు ఎన్టీఆర్,  ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ ని కూడా కళ్యాణ్ రామ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో కలిపి నిర్మించబోతున్నాడు.  ఇలా జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే ఈ రెండు పాన్ ఇండియా మూవీ లకు కూడా కళ్యాణ్ రామ్ నిర్మాత గా వ్యవహరించబోతున్నాడు.  ఇలా ఒకే సారి రెండు ఫుల్ క్రేజ్ ఉన్న పాన్ ఇండియా మూవీ లకు నిర్మాతగా వ్యవహరించే అవకాశం రావడంతో కళ్యాణ్ రామ్ జాక్ పాట్ కొట్టేశాడు అంటూ కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: