టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి , నిర్మించి అద్భుతమైన గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ ఇప్పటివరకూ తన కెరియర్లో ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చాడు. అలా కళ్యాణ్ రామ్ అవకాశం ఇచ్చిన దర్శకులలో కొంత మంది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులుగా అద్భుతమైన స్థాయిలో ఉన్నారు.  కళ్యాణ్ రామ్ తో మొదటి సినిమాకు దర్శకత్వం వహించే మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాలను అందుకున్న దర్శకుల గురించి తెలుసుకుందాం. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అతనొక్కడే సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి ఈ మూవీతోనే దర్శకుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరు గా కొనసాగుతున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడిమూవీ తోనే దర్శకుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు గా కొనసాగుతున్నాడు. తాజాగా కళ్యాణ్ రామ్  'బింబిసార' అనే మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు మొదటి రోజే బ్లాక్బస్టర్ టాక్ లభించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మల్లాడి వశిష్ట్ ఈ మూవీ తోనే దర్శకుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: