సాహో, రాధే శ్యామ్ సినిమాల ఫలితాలు ఎంత నిరాశపరిచినా కూడా ప్రభాస్ అభిమానులు అవేమీ పట్టించుకోకుండా సలార్ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కెజిఎఫ్ దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ సినిమా కావడంతో అంచానాలు అనేవి అసలు మాములుగా లేవు.అసలు ముందు ఆది పురుష్ సినిమా రిలీజవుతుందా లేక సలార్ సినిమా వస్తుందానే విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ ఒకప్పటి మాస్ డార్లింగ్ ని ఇందులో చూసుకోవచ్చనే అంచనాలు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఉన్నాయి.అయితే ఇది ఒకే భాగమా లేక సీక్వెల్ కూడా ప్లాన్ చేశారా అనేది యూనిట్ చాలా గుట్టుగా ఉంచుతోంది. ఇక అసలు విషయానికి వస్తే సలార్ సినిమాలో కమల్ హాసన్ విక్రమ్ తరహా క్లైమాక్స్ ట్విస్టు ఒకటి ప్లాన్ చేస్తున్నారని బెంగళూరు నుంచి టాక్. ఆ సినిమా చివరిలో సూర్య పాత్ర రోలెక్స్ గా ఎంట్రీ ఇచ్చి ఆ నాలుగైదు నిమిషాలే ఎంత రచ్చ చేసిందో ఇటీవల చూసాం.కేవలం ఆ ఒక్క ఎపిసోడే సబ్జెక్ట్ ఎలివేషన్ ని అసలు పది రెట్లు పెంచిందనడం అతిశయోక్తి కాదు.


ఇప్పుడదే తరహాలో సలార్ సినిమాలో కెజిఎఫ్ రాఖీ భాయ్ తో పది నిమిషాల ఎపిసోడ్ ఒకటి ప్లానింగ్ లో ఉందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజమో కాదో చెప్పడానికి అధికారిక రుజువు లేదు కానీ ప్రచారం అనేది జోరుగా ఉంది.ఇక దీనికి ఊతమిచ్చేలా యష్ ఇంకా గెడ్డం తీయకపోవడం, హెయిర్ స్టైల్ ని అలాగే కొనసాగించడం పలు అనుమానాలు రేపుతోంది. దీని కోసమే అలా చేస్తున్నారన్న కామెంట్స్ కూడా లేకపోలేదు. ఇంకా ఇదంతా తేలడానికి నెలల సమయం పడుతుంది. మైన్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సలార్ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఎంత శాతం చిత్రీకరణ పూర్తయ్యిందనేది చెప్పడం లేదు కానీ సినిమాని సగానికి పైగానే ఫినిష్ చేశారని వినికిడి. వీలైనంత త్వరగా ఆ అప్డేట్స్ ఏవో మొదలుపెడితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: