నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న చిరంజీవి కెరియర్ లో ఎన్నో భయంకరమైన ఫ్లాప్ లు ఉన్నాయి. నటుడుగా చిరంజీవి రాణించిన సినిమాలు కూడ ఫ్లాప్ అయిన సందర్భాలు అనేకం. 9 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయి రాజకీయాలలో తిరిగి మళ్ళీ తిరిగి ఆరాజకీయాలు తనకు నప్పవు అని తెలుసుకుని మళ్ళీ సినిమాల వైపు యూటర్న్ తీసుకున్నప్పటికీ సగటు ప్రేక్షకుడు చిరంజీవిని మెగా స్టార్ హోదా లోనే కొనసాగిస్తున్నారు.


అలాంటి టాప్ హీరో ‘ఆచార్య’ మూవీ ఫ్లాప్ ను ఎందుకు అంత మరిచిపోలేని విషయంగా తీసుకున్నాడు అన్న విషయం చాలామందికి అర్థంకాని విషయంగా మారింది. వాస్తవానికి కొరటాల శివ ఇప్పటివరకు పరాజయం ఎరుగని దర్శకుడు. అలాంటి దర్శకుడు ఒక అవుట్ డేటెడ్ నక్సల్ నేపధ్యం ఉన్న ఒక కథను చిరంజీవికి చెపితే ఎంతో అనుభవం ఉన్న చిరంజీవి అలాంటి కథకు ఓకె ఎందుకు చేసాడు అన్నది సమాధానం లేని ప్రశ్న.


ఇప్పుడు ఆసినిమా ఫ్లాప్ అయిన తరువాత ప్రేక్షకులు చెత్త కథలను భారీ బడ్జెట్ తో టాప్ హీరోలను పెట్టి తీస్తే జనం చూడరు అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా తాను కూడ ఈవిషయంలో బాధితుడునే అంటూ తన పై తాను సెటైర్ వేసుకున్నాడు. ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన చిరంజీవి చేసిన ఈకామెంట్ లపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో లోతైన చర్చలు జరుగుతున్నాయి.


‘బింబిసార’ ‘సీతారామం’ ‘కార్తికేయ 2’ లాంటి వెరైటీ సినిమాలను తీయాలని చిరంజీవి యంగ్ డైరెక్టర్ లకు పిలుపు ఇచ్చాడు. వాస్తవానికి అలాంటి వెరైటీ కథతో కూడుకున్న సినిమాలలో మాస్ ఇమేజ్ విపరీతంగా ఉన్న చిరంజీవి ధైర్యం చేసి నటించినా సగటు ప్రేక్షకుడు చూస్తాడా అన్నదే ప్రశ్న. వాస్తవానికి ఒక సినిమా ఘన విజయం సమిష్టి కృషితోనే వస్తుంది. సూపర్ హిట్ అయినప్పుడు హీరో కావడం సూపర్ ఫ్లాప్ అయినప్పుడు దర్శకుడు కారణం అంటే ఎంతవరకు సమంజసం అంటూ చిరంజీవి కామెంట్స్ పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: