అనుష్కను వెండితెరపై చూసి చాలా రోజులైంది. కనీసం టీవీల్లో, ఓటీటీల్లో అయినా చూద్దాం అంటే సినిమాలు ఏమి చేయడం లేదు. ఈమె విషయం పక్కన పెడదాం.


సమంతను చూసి కూడా ఎన్ని రోజులైంది. విడాకులు తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించింది లేదు. ఏదో బాలీవుడ్‌ టీవీ షోలో కనిపించింది అంతే. అయితే ఈ ఇద్దరినీ ఓటీటీలోకి తీసుకురావాలని చూస్తోందట ఆహా. ప్రేక్షకులతో ఆహా అనిపించే ఈ ప్రయత్నం చేస్తోంది 'ఆహా' టీమ్‌. అయితే ఇద్దరూ కలసి వస్తారా? లేక వేర్వేరుగా వస్తారా అనేది చూడాలి.


నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్‌ 2' త్వరలో స్టార్ట్‌ అవుతుంది. ఈ షోకి సంబంధించి థీమ్‌ సాంగ్‌ను త్వరలో విడుదల చేస్తున్నారు కూడా. అయితే ఈ షోకి గెస్ట్‌లుగా ఈసారి హీరోయిన్లు కూడా ఉంటారని తెలుస్తోంది. అంటే తొలి సీజన్‌లో రష్మిక మందన తప్ప ఇంకెవరూ కూడా రాలేదు. ఆమె కూడా 'పుష్ప' ప్రచారంలో భాగంగా వచ్చిందే. అయితే రెండో సీజన్‌లో హీరోయిన్లను ఎక్కువగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట ఆహా టీమ్‌.


 


'అన్‌స్టాపబుల్‌ 2'ను పవన్‌ కల్యాణ్‌ - త్రివిక్రమ్‌తో స్టార్ట్‌ చేస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అంటే ఈ సీజన్‌ను ఫ్రెండ్స్‌ అనే కాన్సెప్ట్‌లో నడుపుతారు అని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే.. సమంత, అనుష్క కలసి రావొచ్చు. లేదంటే వేర్వేరుగా రావొచ్చు. అనుష్క అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య షో కనిపించబోతున్నా అని క్లూ చెప్పిందట. కాబట్టి ఆమె ఫిక్స్‌ అనుకోవచ్చు. ఇక సమంత అంటే 'ఆహా' మనిషే.


 


గతంలో 'సామ్‌ జామ్‌' అనే షో కూడా చేసింది వారి కోసం. ఆమె రాక కూడా ఈజీనే. మరి చూద్దాం. అన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయో లేదో. ఒకవేళ అనుష్క బయటకు వస్తే ఆసక్తికర విషయాలు బయటకు ఏమీ వచ్చే పరిస్థితియితే ఉండదు. అయితే సమంత వస్తే మాత్రం కొన్ని ఆసక్తికర ప్రశ్నలు బయటకు వస్తాయి. సమాధానాల సంగతి చూడాలి. అయితే బాలకృష్ణకు, నాగార్జునకు మధ్య అంతగా సఖ్యత అయితే లేదు. దీంతో సమంత ఎపిసోడ్‌ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: