
మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా.. కాశ్మీరా పరదేశి హీరోయిన్ గా మురళీ శర్మ , శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 5 నెలల క్రితం ఈ సినిమా నుంచి అఫీషియల్ టీజర్ ను విడుదల చేయగా ఈ టీజర్... ఏడు వింతల గురించి మాకు పెద్దగా తెలియదు నా... మా జీవితాలన్నీ ఏడుకొండల చుట్టూ తిరుగుతా వుంటాయి. మాది తిరుపతి..నాపేరు విష్ణు.. అంటూ సాగే ఈ టీజర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించినా ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నాం అంటూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా నుంచి మొదటి పాటను రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే యేడాది ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటివరకు ప్రకటించకపోవడం గమనార్హం. ఏది ఏమైనా విభిన్న కథలను ఎంచుకునే కిరణ్ అబ్బవరం ఈసారి కూడా ఒక యాక్షన్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.