ఇక కొన్ని రోజులుగా తన సినిమాల షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ యాక్టివ్‌ పాలిటిక్స్‌లో ఫుల్ బిజీగా మారారు. నాలుగు రోజుల పాటు విజయవాడలో ఉండేందుకు శనివారం నాడు సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టుకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు.జనసేన పార్టీ పదో ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నగరానికి చేరుకున్నారు. ఇక ఎయిర్‌ పోర్ట్‌లో సరికొత్త లుక్‌లో కనిపించిన పవన్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఫిదా చేశారు. బ్లాక్‌ టీషర్ట్‌ ఇంకా ఆర్మీ కలర్‌ ప్యాంట్‌ ధరించి వచ్చిన పవన్‌ కొత్త లుక్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.శనివారం నాడు సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన పవన్‌ కళ్యాణ్ రోడ్డు మార్గాన విజయవాడకి బయలు దేరారు.జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మార్చి 14 వ తేదీన మచిలీపట్నంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు విభాగాల నేతలతో ఆయన ప్రత్యేకంగా ఫస్ట్ సమావేశం కానున్నారు.


 ఆ తరువాత 13వ తేదీన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఆ తర్వాత గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను రాజ్‌భవన్‌లో పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.ఇదిలా ఉంటే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్ పలు నిర్ణయాలు ప్రకటిస్తారని.. ఆ సభలోనే మెనిఫెస్టోపైనా క్లారిటీ ఇస్తారని సమాచారం తెలుస్తోంది.దీంతో ఈ సభపై అందరిలో కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. పొత్తులపై కూడా పవన్‌ కళ్యాణ్ ఈ సభలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. మరి పవన్‌ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలను ప్రకటిస్తారో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చెయ్యాల్సిందే. ఇక పవన్‌ కళ్యాణ్ నాలుగు రోజుల పాటు విజయవాడలో అందుబాటులో ఉండనుండడంతో జనసేన పార్టీ నాయకులు ఇంకా అలాగే కార్యకర్తలు విజయవాడ నగరానికి తరలివస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: