
మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ సినిమా. ఇక వసూళ్ల విషయంలో కూడా తగ్గేదేలే అంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ధరణి మచ్చ ఎన్నో రికార్డులను కొల్ల కొడుతున్నాడు అని చెప్పాలి. రోజుల్లోనే 50 కోట్లు వసూలు చేసిన ఏ మూవీ వీకెండ్ లో శని, ఆదివారాల్లో అంతకుమించి అనే రేంజ్ లో వసూళ్లను సాధించింది. ఇక విదేశాల్లోనూ నాని జోరు ఏ మాత్రం తగ్గడం లేదు అని చెప్పాలి. దసరా సినిమాలో ధరణి గాడి దెబ్బకు ఇక ఎన్టీఆర్ రికార్డులు కూడా బద్దలు అయ్యాయి అని చెప్పాలి. ఓవర్సీస్ లో కలెక్షన్స్ ద్వారా ఇలా ఎన్టీఆర్ సినిమా రికార్డును బ్రేక్ చేశాడు నాచురల్ స్టార్ నాని.
ఇప్పటికే విదేశాల్లో ఏడుసార్లు వన్ మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన నాని.. ఇక దసరా సినిమాతో ఎనిమిదో మూవీకి కూడా ఆ లెవెల్ లో వసూళ్లు సాధించి అదరగొట్టాడు. అంతకుముందు ఈగ, నేను లోకల్, బలే బలే మగాడివోయ్, ఎంసీఏ, నిన్ను కోరి, జెర్సీ, అంటే సుందరానికి సినిమాలు వన్ మిలియన్ మార్క్ అందుకోగా ఇటీవల దసరా ఈ రికార్డు సృష్టించింది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ రికార్డు అందుకున్న రెండో హీరోగా నిలిచాడు నాని. తొలి రికార్డు 11 మూవీలతో మహేష్ బాబు పేరిట ఉంది. ఎన్టీఆర్ ఏడు చిత్రాలతో ఉండగా ఎన్టీఆర్ రికార్డును బద్దలు కొట్టేశాడు.