మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మూవీ లలో ఆరెంజ్ మూవీ ఒకటి. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో మూడవ మూవీ గా రూపొందింది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా. .. ముద్దుగుమ్మ జెనీలియా ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నటించింది. కొణిదల నాగబాబు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాకు హరిస్ జయరాజ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయింది.

అలా భారీ అంచనాలు విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు దక్కలేదు. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది.

ఇది ఇలా ఉంటే అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమాను ఈ సంవత్సరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్ లలో రీ రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ రిలీజ్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఈ మూవీ థియేటర్ లలో రీ రిలీజ్ కాగానే భారీ సంఖ్యలో చూడ సాగారు. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు కూడా లభించాయి. ఇది ఇలా ఉంటే రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ కి 3 కోట్లకు పైగా కలెక్షన్ లు వచ్చినట్లు తెలుస్తోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ ప్రాజెక్టు గా మిగిలిపోయిన ఈ సినిమా 3 కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: