చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ బ్లాక్ బష్టర్ అవ్వడంలో చిరంజీవి మాస్ నటనతో పాటు ‘బాస్ వేరీజ్ ద పార్టీ’ ఐటమ్ సాంగ్ అత్యంత కీలకంగా పనిచేసింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను అక్కినేని అఖిల్ ఈ నెలాఖరున విడుదలకాబోతున్న ‘ఏజెంట్’ మూవీ విషయంలో అనుసరించబోతున్నాడు. ఈమూవీ కోసం ఒక మాస్ ఐటమ్ సాంగ్ ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.

 

 

 

ఈ ఐటమ్ సాంగ్ లో అఖిల్ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతాలా తో మాస్ స్టెప్స్ వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక భారీ సెట్ ను వేసి ఆ సెట్ లో ఈపాటను దర్శకుడు సురేంద్ర రెడ్డి చిత్రీకరిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా తీస్తున్న ఈమూవీని చూస్తున్న సగటు ప్రేక్షకుడుకి ఒక భారీ హాలీవుడ్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అంటున్నారు.

 

 

 70 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈమూవీ బిజినెస్ బాగా జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు పోటీగా మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ 2’ విడుదల అవుతున్నప్పటికీ చోళుల చరిత్ర పై అంత ఆశక్తి ఉండదు కాబట్టి యూత్ ప్రేక్షకులు అఖిల్ ‘ఏజెంట్ వైపు వస్తారని ఒక అంచనా. వాస్తవానికి ఈమూవీ విడుదల అనేకసార్లు వాయిదా పడిన నేపధ్యంలో ఈ మూవీ పై మ్యానియా పెంచడానికి ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రామ్ చరణ్ జూనియర్లు అతిధులుగా వస్తారని ప్రచారం జరుగుతోంది.

 

 
‘దసరా’ తరువాత విడుదలైన ‘రావణాసుర’ ఫెయిల్ అవ్వడంతో పాటు ఈవారం విడుదల కాబోతున్న ‘శాకుంతలం’ మూవీ పై అంచనాలు యూత్ లో పెద్దగా లేకపోవడంతో ఈ నెలాఖరుకు రాబోతున్న అఖిల్ ‘ఏజెంట్’ మాస్ యాక్షన్ మూవీ కావడంతో అఖిల్ కోరుకున్న బ్లాక్ బష్టర్ హిట్ అయ్యే ఆస్కారం ఉంది అంటూ కొందరు అంచనాలు వేస్తున్నారు. అయితే సరైన కథ లేకుండా భారీ బడ్జెట్ పెట్టి తీసిన అనేక యాక్షన్ సినిమాలు గతంలో ఫెయిల్ అయ్యాయి దీనితో ‘ఏజెంట్’ విజయం ఆమూవీ కథ పై ఆధారపడి ఉంటుంది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: