పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అలాంటి సినిమాలలో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా గురించి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు సైతం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ ట్రైలర్ పాటలు ఈ సినిమాపై భారీ అంశనాలను క్రియేట్ చేశాయి. 

ఇక ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. ఇక ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా రామాయణం కథ ఆధారంగా రూపొందిందని మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక ప్రభాస్ గతంలో నటించిన రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ సినిమా హిట్ అవ్వడం ప్రభాస్ కి చాలా ముఖ్యం.ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుందో అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే బాక్స్ ఆఫీస్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలను వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలోని చిత్ర బంధం ఈ సినిమా ప్రమోషన్స్ ని శరవేగంగా జరుపుతున్నారు.కాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 6న తిరుపతిలో జరుపనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లేట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా డిజిటల్ స్క్రీనింగ్ హక్కులను ఫ్యాన్సీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: