టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు..RRR సినిమాతో గత ఏడాది పాన్ వరల్డ్ హీరోగా పేరు సంపాదించారు. ఈ చిత్రంతో రామ్ చరణ్ నటనకు గాని ప్రశంశాల వర్షం అందుకున్నారు. గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన రామ్ చరణ్ ప్రస్తుతం తన చిత్రాలను కూడా పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ పెంచే విధంగా చేసుకుంటున్నారు. గతంలో ఒక స్టేజ్ పైన రామ్ చరణ్ మాట్లాడుతూ 2024 చివరిలోపు దాదాపుగా థియేటర్లో ఐదు చిత్రాలను విడుదల చేస్తానని అభిమానులకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.



అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అతని సినిమాలలో కేవలం ఒకటి మాత్రమే 2024 కి ముందు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా గేమ్ చేయింజర్ సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా షూటింగ్ సమయంలో నిరంతరం అడ్డంకులు ఏర్పడుతూ ఉన్నాయి చాలా నష్టాన్ని కూడా కలిగించేలా కనిపిస్తున్నాయి తన సమయం అంతా కూడా వృధా అవుతుంది అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఉపాసన డెలివరీ సమయంలో కూడా కొద్ది రోజులపాటు సినిమా షూటింగ్లకు బంద్ చేశారు రామ్ చరణ్.


ఇటీవలే గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్ సమయంలో పాల్గొన్న రామ్ చరణ్ కు కూడా ప్రమాదం జరిగినట్టుగా నిన్నటి రోజున వార్తలు వినిపించాయి. తన ముఖానికి గాయాలు కావడంతో దాదాపుగా పది రోజులు సైతం రెస్టు తీసుకోమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. మరి రామ్ చరణ్ అభిమానులకు ఇచ్చిన ఐదు సినిమాల హామీ తప్పినట్టే అంటూ మరికొంతమంది అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు కనీసం రెండు చిత్రాలైన 2024 ముందు విడుదల చేస్తారేమో చూడాలి మరి. ప్రస్తుత ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: