మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం మొదటగా వాల్టేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకొని భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇలా వాల్టేర్ వీరయ్య మూవీ తో ఈ సంవత్సరం ప్రారంభంలో సూపర్ సక్సెస్ ను అందుకున్న చిరంజీవి ఆ తర్వాత భోళా శంకర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది.

ఇక దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఇది ఇలా ఉంటే ఉంటే చిరంజీవి తన తదుపరి మూవీ ని "బింబిసారా" ఫేమ్ మల్లాడి వశిష్ట దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాగే ఈ మూవీ షూటింగ్ ను కూడా చిత్ర బృందం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు చిరంజీవి లేకుండా ఉండే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ లో చిరంజీవి కూడా జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా నటించబోయే ముద్దుగుమ్మ గురించి మాత్రం ఇప్పటి వరకు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించలేదు. ఇక తాజాగా ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని త్రిష ... చిరంజీవి కి జోడిగా నటించబోతుంది అని ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ విషయమై ఈ నటిని సంప్రదించగా ఈమె కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త ఫుల్ వైరల్ అవుతుంది. ఇకపోతే యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించబోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: