టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే మూవీలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాని మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరినట్లు మరో ఒకటి , రెండు రోజుల్లో ఈ మూవీ కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని పనులు పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. అవి అద్భుతంగా ఉండడం అలాగే ఈ ప్రచార చిత్రాలలో అనుపమ తన హాట్ అందాలతో ... లిప్ కిస్ లతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. ఇలా అనుపమ ఈ సినిమాలో భారీగా అందాలను ఆరబోసిందీ అని చిత్ర బృందం హింట్ ఇవ్వడంతో ఎప్పుడెప్పుడు వెండి తెరపై ఈ బ్యూటీ అందాలను చూస్తామా అని అనుపమ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలోని "ఓ మై లిల్లీ" అంటూ సాగే సాంగ్ ను ఈ రోజు విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన సాంగ్ విడుదల తేదీ కి వేదికను కూడా ఖరారు చేశారు. ఈ సినిమాలోని "ఓ మై లిల్లీ" అంటూ సాగే పాటను మార్చి 18 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అందుకు సంబంధించిన ఈవెంట్ ను "ఏ ఎం బి" సినిమాస్ స్క్రీన్ 1 హైదరాబాదు లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sj