విశ్వక్ సేన్ తాజాగా "గామి" అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి చాందిని చౌదరి కీలకమైన పాత్రలో నటించగా ... విద్యాధర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చి 8 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా ఇప్పటి వరకు 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు విడుదల అయిన 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి విడుదల అయిన 8 రోజుల్లో నైజాం ఏరియాలో 3.82 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 1 కోటి ... ఉత్తరాంధ్ర లో 75 లక్షలు ... ఈస్ట్ లో 63 లక్షలు ... వెస్టు లో 35 లక్షలు ... గుంటూరు లో 40 లక్షలు ... కృష్ణ లో 38 లక్షలు , నెల్లూరు లో 27 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8 రోజుల్లో 7.60 కోట్ల షేర్ ... 13.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి 8 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 85 లక్షలు , ఓవర్ సీస్ లో 2.30 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.


మొత్తంగా ఈ సినిమాకి 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 10.75 కోట్ల షేర్ ... 20.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 10.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 25 లక్షల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs