యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా కల్కి 2898 AD. ఇది సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ నేపథ్యంలో భారీ ప్రయోగాత్మక చిత్రం. ఈ మూవీలో కథ మహాభారత కాలంలో మొదలై నేటితరానికి కనెక్ట్ అయి ఉంటుంది.భవిష్యత్ ప్రపంచం ఎలా ఉండబోతోందో అనేది తెరపై ఆవిష్కరిస్తున్నామని నాగ్ అశ్విన్ చెప్పడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి.ఈ సంవత్సరం మే 9న ఈ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే మొన్నటికి మొన్న ఏపీ ఎన్నికల తేదీని ప్రకటించడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సినిమా ఆగస్ట్ 23 వ తేదీకి వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.అలాగే మరోవైపు స్పెషల్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీలో ఉన్న ప్రభాస్ ఇప్పుడు మళ్లీ నగరానికి చేరుకున్నాడు. తాజా అప్‌డేట్ ప్రకారం.. నాగ్ అశ్విన్ మొదట ప్రభాస్ భాగాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని .. వచ్చే వారం ఒక చిన్న షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేసారని సమాచారం తెలుస్తుంది.ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌కి సంబంధించిన ప్యాచ్‌వర్క్ సీన్స్ అన్ని పూర్తవుతాయి.


వైజంతీ మూవీస్ ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్‌లో మొదటిసారి సూపర్ హీరోగా నటిస్తున్నాడు. అతడి అభిమానులు ఈ సినిమాకి భారీ రికార్డుల నమోదు కావొచ్చని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ మూవీ బాహుబలి రికార్డులని బ్రేక్ చేస్తుందట.ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్- కమల్ హాసన్ లను ఒకే ఫ్రేమ్ లో వీక్షించడం, దీపిక పదుకొనే గ్లామర్ ట్రీట్ పై ఎన్నో భారీ అంచనాలున్నాయి. ఇంకో 50 రోజుల్లోనే కల్కి రిజల్ట్ గురించి అప్డేట్ అనేది వస్తుంది. ఇక అప్పటి దాకా ప్రచారంలో కల్కి టీమ్ స్పీడ్ కొనసాగనుంది. ఈ సినిమాకి హిట్ టాక్ పడితే ఖచ్చితంగా లాంగ్ రన్ లో 2000 కోట్లకు పైగా వసూళ్లు రావడం పక్కా అట. ప్రభాస్ రీసెంట్ గా సలార్ సినిమాతో యావరేజ్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా 600 కోట్ల వసూళ్ళని నమోదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: