అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకంగా చేస్తోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప ది రూల్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సుకుమార్ దర్శకత్వంలో ఏకంగా 300 కోట్ల బడ్జెట్ తో పుష్ప ది రూల్ మూవీ భారీ అంచనాలతో తెరకెక్కుతోంది.ఈ మూవీని ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పుష్పకి మించి ఈ సినిమా ఉండాలనే ఉద్దేశ్యంతో సుకుమార్ పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ ని చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారట. పుష్ప ది రూల్ మూవీలో ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా పుష్ప ది రూల్ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ పుష్ప ది రూల్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఇంకా అద్భుతమైన సాంగ్స్ ని కంపోజ్ చేసి ఇచ్చారట.ఇక పుష్ప 2 టీజర్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కి ఇంకా సమయం ఉండటంతో కొత్త అప్డేట్ ఏదైనా ఇవ్వాలని అడుగుతున్నారు.


తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్  పుష్ప ది రూల్ టీజర్ ఎప్పుడని అడుగుతున్నారు. దీనికి మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ కూడా అప్డేట్ ఇచ్చారు.ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ విడుదల ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఉత్సాహానికి హద్దులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో ఈ అప్డేట్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ రిలీజ్ అయితే సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మూవీ టీజర్ బట్టి బిజినెస్ కూడా మొదలయ్యే ఛాన్స్ ఉంది. టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే బయ్యర్లు నిర్మాతలు చెప్పన ధరలని కొనడానికి ముందుకి వస్తారు. ఇంకా అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలు కూడా హక్కుల కోసం పోటీ పడతాయి. బన్నీ ఈ సినిమాతో వెయ్యి కోట్ల మార్కెట్ ను టచ్ చేయాలని అనుకుంటున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకు ఏమాత్రం వెనుకడకుండా సినిమాను రెడీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: