టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ తాజాగా హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా , టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యింది. మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి ఈ సంవత్సరం అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమాల లిస్టులో చేరిపోయింది. ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా "జై హనుమాన్" అనే సినిమా ఉండబోతున్నట్లు హనుమాన్ సినిమా చివరిలో ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. దానితో హనుమాన్ సినిమానే ఈ స్థాయిలో ఉంటే జై హనుమాన్ మూవీ ఏ స్థాయిలో ఉంటుందా అని ప్రేక్షకుల్లో జై హనుమాన్ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇకపోతే తాజాగా జై హనుమాన్ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. తాజాగా జై హనుమాన్ మూవీ యూనిట్ ఒక అదిరిపోయే రేంజ్ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ సినిమాని ఐమాక్స్ 3D లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక హనుమాన్ సినిమాని మామూలు బడ్జెట్ తో 2D లోనే ప్రశాంత్ వర్మ అద్భుతమైన రీతిలో తెరకెక్కించాడు. మరి హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్  అయ్యింది కాబట్టి "జై హనుమాన్" కు భారీ భారీ బడ్జెట్ ను నిర్మాతలు కేటాయించే అవకాశం చాలా వరకు ఉంది. ఇక ఈ సినిమాను ఐమాక్స్ 3D రూపొందించనున్న నేపథ్యంలో ఈ మూవీ విజువల్ గా అదిరిపోయే రేంజ్ లో ఉండే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: