
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఈ సినిమా తో తన కెరియర్ లోనే భారీ నెంబర్స్ ను టార్గెట్గా పెట్టుకున్నాడు నేచురల్ స్టార్. ఇక అందుకోసం గతంలో ఏ సినిమాకు చేయినంత గట్టిగా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్నాడు .. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న హిట్ 3ని 60 కోట్ల బడ్జెట్ తో నాని స్వయంగా నిర్మించారు .. ఇప్పటికే ఈ సిరీస్ మీద గట్టి నమ్మకం ఉన్న .. నాని ఫామ్ కారణంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా భారీ నెంబర్స్ ని అందుకుంది ఈ సినిమా .. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 32 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా .
ఇక మొత్తంగా 40 కోట్ల మార్కును క్రాస్ చేసిందన్న టాక్ కూడా వినిపిస్తుంది .. అయితే ఇక్కడ హిట్ 3 బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాలి .. అప్పుడే హిట్ 3 .. హిట్ లిస్టులోకి వస్తుంది .. ప్రస్తుతం ఈ సినిమా మీదున్న అంచనాలు హైప్ చూస్తుంటే మొదటి వారంలోని బ్రేక్ ఈవెన్ అందుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు .. థియేట్రికల్ లెక్కలు పక్కన పెడితే ఓటీటీ బిజినెస్ తో ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసారు నాని .. కేవలం ఓటీటీ హక్కుల కోసమే 54 కోట్ల డీల్ జరిగినట్టు టాక్ వినిపిస్తుంది .. అలాగే ఆడియో , శాటిలైట్ రైట్స్ ఇవన్నీ కలుపుకుంటే హిట్ 3 మొత్తంగా 100 కోట్లు మార్క్‌ను దాటింది అంటున్నారు సిని బిజినెస్ విశ్లేషకులు ..