సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబోలు సెట్ అయినట్లే సెట్ అయ్యి మిస్ అయిపోతూ ఉంటాయి.  అలాంటి కాంబోస్ ఎన్నెన్నో ఉన్నాయి. మరి ముఖ్యంగా కొన్ని కాంబోస్ గురించి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాంటి కాంబోనే నాచురల్ స్టార్ నాని - లెక్కల మాస్టర్ సుకుమార్ . నాచురల్ స్టార్ నాని ఎంత నాచురల్ గా యాక్ట్ చేస్తాడు అనే విషయం అందరికీ తెలిసిందే . అందుకే నాచురల్ స్టార్ అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చేశారు అభిమానులు . ఇక సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రతి సినిమాను చాలా రియలిస్టిక్  గా తెరకెక్కిస్తూ ఉంటారు . వీళ్ళిద్దరి కాంబోలో ఓ సినిమా రావాలి కానీ మిస్ అయ్యింది.


ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దానికి కారణం హిట్ 3 మూవీ . హిట్ 3 సినిమా సూపర్ సక్సెస్ అయిన సంధర్భంగా గత తాలూకా వార్తలను గుర్తు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. నానితో సినిమా తరికెక్కించడానికి చాలామంది డైరెక్టర్ లు గతంలో భయపడ్డారు . దానికి కారణం సరిగ్గా మార్కేట్ లేకపోవడం.  కానీ ఇప్పుడు అదే డైరెక్టర్ లు నానితో సినిమా కోసం ఇంటి ముందు క్యూ కడుతున్నారు .



అంత రేంజ్ కి  ఎదిగిపోయాడు నాని అంటూ ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన "నాన్నకు ప్రేమ"తో సినిమాలో హీరోగా ముందుగా మహేష్ బాబును అనుకున్నారట . ఆ తర్వాత ఆయన రిజెక్ట్ చేశారు . ఆ తర్వాత నానిని కూడా హీరో గా  చూపించాలి అనుకున్నారట సుకుమార్ కాని ఆయన సన్నిహిత వర్గాలు నాని ని ఈ క్యారెక్టర్ లో ఆయన కి ఈ సినిమా ఛాన్స్ ఇవ్వకపోవడమే బెటర్ అంటూ నాని వద్దకు ఈ సినిమా ఆఫర్ పోనీకుండానే వేరే హీరో ఖాతాలో ఈ మూవీ పడేలా చేశారట .  సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఒకవేళ ఈ కాంబో సెట్ అయ్యుంటే మాత్రం కెవ్వు కేక అనే చెప్పాలి జస్ట్ మిస్..చూద్దం మరి వీళ్ల కాంబోలో మూవీ ఎప్పుడు సెట్ అవుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: