సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందుతుందంటే ఆ సినిమాకు డబ్బులు ఖర్చు పెట్టేది ప్రొడ్యూసర్ అయినా.. ఇతర బాధ్యతలు అన్ని దర్శకుడు పైనే ఉంటాయి. ఏకంగా 24 విభాగాలను బ్యాలెన్స్ చేస్తూ.. ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా.. ఒకటికి రెండుసార్లు ప్రాజెక్ట్ మొత్తాన్ని పరిశీలించుకోవాల్సి ఉంటుంది. తమను నమ్మిన నిర్మాతలకు నష్టాలు కలగకుండా.. పెట్టిన డబ్బుకు ఓ రూపాయి ఎక్కువగానే వచ్చేలా దర్శకుడు సినిమాను రూపొందించాలి. దాని కోసం ప్రతి డైరెక్టర్ కష్టపడుతూనే ఉంటారు. మనది కాదులే అని సినిమా ఎలా తీసిన చెల్లుబాటు అవుతుంది కదా అని.. డబ్బులు మంచినీళ్లలా ఖర్చు పెడుతూ.. కంటెంట్‌ లేకుండా సినిమాలను రూపొందిస్తే మాత్రం దాని ఎఫెక్ట్ కచ్చితంగా దర్శకుడు పైనే పడుతుంది.
 

ఫ్యూచర్ లేకుండా పోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలాంటి సంఘటనలకు ఉదాహరణ.. తాజాగా రిలీజ్ అయిన రెండు సినిమాలు నిలుస్తున్నాయి. ఈ రెండు సినిమాలు థియేటర్లలో కనీసం ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోకుండా ఘోరమైన డిజాస్టర్లను ఎదుర్కొన్నాయి. ఇంతకీ ఆ సినిమాలో ఏంటో.. హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం. టాలీవుడ్ రౌడీ సార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై.. దిల్‌రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన‌ ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా రిలీజై ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఘోర డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సినిమా 5వ రోజు నుంచి థియేటర్లలో కనీసం ఒక్క టికెట్ కూడా అమ్ముడు పోకుండా ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.

 

ఇక ఈ సినిమా తర్వాత.. పరుశురాంతో ఇప్పటివరకు సినిమాను చేయడానికి ఏ ఒక్క హీరో కూడా ముందుకు రాలేదు. ఇక‌ మెగా కాంపౌండ్ నుంచి కూడా ఓ సినిమా వచ్చి ఇలాంటి రిజల్టే అందుకుంది. ఆ సినిమా ఏదో కాదు మట్కా. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా కూడా.. థియేటర్లో నాలుగు రోజులకే డీల పడిపోయింది. ఐదవ రోజు కనీసం ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. కరుణకుమార్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని గట్టి నమ్మకాలు పెట్టుకున్నారు మెగా అభిమానులు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత అవుట్‌పుట్ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్, అలాగే డైరెక్టర్ కరుణకుమార్ కెరీర్‌లు డైలమాలో పడిపోయాయి. వీరిద్దరితో సినిమాలు తీయాలంటే నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. అలా..ఇటీవ‌ల‌ టాలీవుడ్‌లో ఘోరమైన డిజాస్టర్లు మూట కట్టుకున్న సినిమాలుగా ఈ రెండు సినిమాలు నిలిచిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: