సినిమా ఇండస్ట్రీ లో ఓ కాంబోలో మూవీ వచ్చి అద్భుతమైన విజయం సాధించింది అంటే మరో సారి ఆ కాంబోలో సినిమా రావాలి అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో తరుణ్ భాస్కర్ ఒకరు. వీరిద్దరి కాంబోలో కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చూపులు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ లో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో నటుడిగా విజయ్ దేవరకొండ కు , దర్శకుడిగా తరుణ్ భాస్కర్ కి మంచి గుర్తింపు వచ్చింది.

ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ అనేక సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తరుణ్ భాస్కర్ "పెళ్లి చూపులు" సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది , కీడా కోలా అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక ఈయన సినిమాలకు దర్శకత్వం వహించడం కంటే కూడా సినిమాల్లో నటించడం పై ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ వస్తున్నాడు. విజయ్ దేవరకొండ , తరుణ్ భాస్కర్ కాంబోలో మరో మూవీ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... విజయ్ దేవరకొండ , తరుణ్ భాస్కర్ కాంబో మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ,  ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు శర వేగంగా జరుగుతున్నట్లు , విజయ్ దేవరకొండ , తరుణ్ భాస్కర్ కాంబో సినిమాకు బినామీ అనే టైటిల్ను కూడా అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబోలో మూవీ కనక సెట్ అయితే దానిపై అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd