
మొన్నటికి మొన్న రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే సినిమాకి సంబంధించిన కీలక క్లిప్స్ తాలూకా ఫొటోస్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది . మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా చాలా మంది బ్యూటీ పేర్లు తెరపైకి వచ్చాయి . అయితే ఫైనల్లీ నయనతారనే ఈ సినిమాలో హీరోయిన్గా కన్ఫర్మ్ అయ్యింది అంటూ తెలుస్తుంది.
అంతేకాదు ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉంది అని ఆ హీరోయిన్ రోల్ కోసం "సరైనోడు" సినిమాలో తన నటనతో అదరగొట్టిన లేడీ ఎమ్మెల్యేగా ట్యాగ్ చేయించుకున్న "క్యాధరిన్" ని ఫైనలైజ్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. అనిల్ రావిపూడి చాలా డిఫరెంట్గా హీరోయిన్స్ ని చూస్ చేసుకుంటాడు . మరొకసారి తన మార్క్ ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు . ఆల్మోస్ట్ ఆల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నయనతార అదే విధంగా కేథరిన్ ఫిక్స్ అయిపోయినట్లు టాక్ వినిపిస్తుంది . చిరంజీవి సినిమాలో లేడీ ఎమ్మెల్యే నా..? వావ్ కేక అని కొంతమంది అంటుంటే.. చిరంజీవి వయసుకి కేథరిన్ వయసుకి ఏమన్నా సంబంధం ఉందా ..? అంటూ ఘాటు కౌంటర్స్ కూడా వేస్తున్నారు జనాలు..!