
ఎప్పుడు లేని విధంగా అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించబోతున్నాడు అని ఈ సినిమాలో ముగ్గురు బ్యూటీలతో రొమాన్స్ చేయబోతున్నాడు అంటూ క్రేజీ న్యూస్ లీకై వైరల్ గా మారింది . అందులో ఒక హీరోయిన్ సమంత సెలెక్ట్ అయ్యింది అంటూ కూడా టాక్ వినిపించింది. అయితే సమంత ప్రొడ్యూస్ చేసిన "శుభం" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఈ విషయాన్ని పరోక్షకంగా కన్ఫామ్ చేసేసింది సమంత . అట్లీ - బన్నీ సినిమాలో హీరోయిన్గా నటించట్లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది . బన్నీ - అట్లీ సినిమా లో తాను నటించడం లేదు అని కుదిరితే అట్లీ దర్శకత్వంలో ఫ్యూచర్లో నటిస్తానేమోనని పరోక్షకంగా క్లారిటీ ఇచ్చింది .
దీనితో సోషల్ మీడియాలో సమంత ఎందుకు బన్నీ లాంటి స్టార్ హీరో సినిమా రిజెక్ట్ చేసింది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది . అయితే సమంత ఇలా హీరో క్యారెక్టర్ కి ప్రాధాన్యత ఉన్న సినిమాలను సైన్ చేయకూడదు అంటూ డిసైడ్ అయిందట . లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ లేదంటే సమాజానికి ఉపయోగపడే ఫిలిమ్స్ ఈ విధంగా ఉండేటువంటి రోల్స్ ని చూస్ చేసుకుంటుందట . మరీ ముఖ్యంగా కామెడీ ఎంటర్టైనర్ లేదంటే మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ అదికూడా ఫిమేల్ సెంట్రిక్ తో వచ్చిన మూవీస్ లో నటించాలి అంటూ డిసైడ్ అయ్యిందట. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండాలి అని ఫిక్స్ అయిపోయిందట . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె అట్లీ సినిమాను రిజెక్ట్ చేసింది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. సమంత తీసుకున్న డెసిషన్ మంచిదే అంటున్నారు ఆమె అభిమానులు . రీసెంట్గా ఆమె ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమా మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . ప్రతి ఒక్కరు కూడా సమంతను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!