
ప్రస్తుతం పవన్ చేతిలో మూడు నాలుగు సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ రాజకీయాలతో పాటు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఈ సినిమా షూట్ లలో పాల్గొంటున్నాడు. ఇక మహేష్.. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళితో ఎస్ఎస్ఎంబి 29 షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందుతుంది. ప్రస్తుతం ఇండియా మొత్తం మోస్ట్ ఎవెయిటెడ్‌గా ఈ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తుంది. ఇదిలా ఉంటే.. గతంలో పవన్ నటించిన సినిమాల్లో ప్రియురాలిగా నటించినా హీరోయినే.. తర్వాత మహేష్ బాబుకు తల్లి పాత్రలోనూ నటించిందని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు తారక్ రెండు బ్లాక్ బస్టర్ సినిమాల్లోనూ ఈ అమ్మడు తన నటనతో మెప్పించిందట.
ఇక ఈ రెండు సినిమాల్లోనూ తారక్ తల్లిగానే ఆమె మెరవడం విశేషం. ఇక ఇప్పుడు ఆమె హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేసి.. టీచర్ గా పిల్లలకు పాఠాలు చెప్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు దేవయాని. పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాతో హీరోయిన్గా ఆడియన్స్ను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఈ సినిమాలో పవన్ లవర్ గాను నటించి ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి.. చెన్నకేశవరెడ్డి లో బాలయ్య సోదరిగా.. తర్వాత మహేష్ బాబు నాని సినిమాలో మహేష్ కో అమ్మగా నటించి ఆకట్టుకుంది. ఇక ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, అరవింద సమేత సినిమాల్లో తల్లిగా మెరిసింది. అలా సెకండ్ ఇన్నింగ్స్ లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దేవయాని.. ప్రస్తుతం టీచర్గా లైఫ్ లీడ్ చేస్తుంది.