టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జటిక్ స్టార్ గా తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్న రామ్ పోతినేని ఈ మధ్యకాలంలో హిట్ కొట్టిందే లేదు . తన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే రామ్ పోతినేని నటించిన సినిమాలు హిట్ అయిన ఫ్లాప్ అయిన ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఒకే రేంజ్ లో ఉంటుంది . కాగా రీసెంట్గా రాంపోతునేని త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపించాయి.  కానీ ఇది మల్టీస్టారర్ మూవీ  అని.. ఇందులో ఆయన పాత్ర కన్నా కూడా వెంకటేష్ పాత్ర పూర్తిగా లీడ్ గా ఉంటుందని తెలుసుకుని రాం పోతినేని ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.

కాగా ప్రజెంట్ రామ్ పోతినేని తన 22వ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే సెలెక్ట్ అయ్యింది.  వీళ్లిద్దరి కాంబో బాగుంటుంది అంటూ జనాలు అంచనా వేస్తున్నారు . కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కొన్ని కొన్ని ప్రమోషనల్ కంటెంట్  ప్రేక్షకుల్లో బాగా మంచి సినిమా పై బజ్ క్రియేట్ చేసింది . తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది.  దీనికి సంబంధించి రామ్ తాజాగా డబ్బింగ్ కూడా పూర్తి చేశారు .

దీనికి సంబంధించిన పిక్చర్ బయటకు వచ్చింది. ఈ టైటిల్ గ్లింప్స్ ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి అభిమానులు నెలకొంది . అంతేకాదు ఈ సినిమాకు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ గా ఉండడం హైలైట్ గా మారింది. ఈ మూవీతో అయిన రాం పోతినేని హిట్  కొట్టాలి అంటే ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు . ఈ సినిమాతో అది కుదురుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు , సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో రామ్ పోతినేనికి సంబంధించిన ఈ వార్త బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: