బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో అజయ్ దేవగన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించాడు. అలాగే ఆయన నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. కొంత కాలం క్రితం రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాను తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అజయ్ దేవ్గన్ , రామ్ చరణ్ కు తండ్రి పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఈయన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఈయన పాత్రకు ఈ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉండడంతో ఈ మూవీ ద్వారా ఈయనకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో కూడా లభించింది.

కొంత కాలం క్రితం అజయ్ దేవ్గన్ "రైడ్" అనే సినిమాలో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో తాజాగా రైడ్ మూవీ కి కొనసాగింపుగా రైడ్ 2 అనే సినిమాను రూపొందించారు. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబడుతూ ఫుల్ జోష్లో దూసుకుపోతోంది.

ఇకపోతే ఈ మూవీ కి బుక్ మై షో ఆప్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇప్పటివరకు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 2 మిలియన్ టికెట్లు సేల్ అయినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ad